టీజర్‌ టాక్‌: పైరేటెడ్‌ లవ్‌స్టోరీ

మరిన్ని వార్తలు

పైరసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న తాజా మూవీ 'హీరో హీరోయిన్‌'. 'ఏ పైరేటెడ్‌ లవ్‌స్టోరీ' అనేది క్యాప్షన్‌. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నవీన్‌ చంద్ర, పూజా జవేరి, గాయత్రి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు నవీన్‌ చంద్ర.

 

తొలి సినిమాతోనే సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ అనిపించుకున్నాడు. కానీ తర్వాత హీరోగా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. దాంతో ఈ మధ్య విలన్‌గానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ తన టాలెంట్‌: ప్రదర్శిస్తున్నాడు. ఇక లేటెస్ట్‌గా 'అడ్డా' ఫేం కార్తిక్‌ దర్శకత్వంలో నవీన్‌ చంద్ర సోలో హీరోగా నటించాడు. పైరసీ బూతం సినీ పరిశ్రమను ఎలా వేధిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధం లేదీ పైరసీ బూతానికి. ఇదే నేపథ్యంలో పైరసీని అరికట్టడమెలా..? అనే పాయింట్‌ని మెయిన్‌ పాయింట్‌గా తీసుకుని ఈ సినిమా తెరకెక్కింది. టీజర్‌ని చాలా బాగా కట్‌ చేశారు. టీజర్‌లో డైలాగులు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

 

హీరో క్యారెక్టరైజేషన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, పిక్యరైజేషన్‌ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాతో నవీన్‌చంద్ర హీరోగా సత్తా చాటడం ఖాయమనిపిస్తోంది. 'ప్రతీ మగాడూ ప్లేబోయే, ఛాన్స్‌ దొరికితే మేం కుక్కలమే.. ప్రొడ్యూసర్‌ కూతురైతే ఏంటే... పైరసీని వదలను, నిన్నూ వదలను..' అంటూ హీరో చెప్పే డైలాగులు టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS