బాలీవుడ్ ప్రేమ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ త్వరలో అధికారికంగా వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇద్దరి మధ్యా వయసు తేడా 15 ఏళ్ళకు పైనే. అయినాగానీ, ఈ ఇద్దరి మద్యా ప్రేమ బంధం చిగురించింది. మలైకాకి పెళ్ళయి, పిల్లలున్నారు.. అయితే ఆ వైవాహిక బంధం కొన్నాళ్ళ క్రితం ‘విడాకులతో’ బద్దలైపోయింది. అసలు ఆ తతంగానికి అర్జున్ కపూరే కారణమన్న ఆరోపణలూ లేకపోలేదు. అబ్బే, అదేం లేదు.. అప్పటికి అర్జున్‌తో పెద్దగా పరిచయమే లేదని మలైకా పలు సందర్భాల్లో చెప్పింది.
ఆ సంగతి పక్కన పెడితే, అర్జున్ కపూర్‌కి మలైకా అరోరాలో ఏం నచ్చింది.? అనే విషయమై ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్ళు చేసేస్తున్నారు. ఇద్దరూ కొన్నాళ్ళ క్రితమే ‘ప్రేమ’ని కన్‌ఫామ్ చేశారు. కానీ, పెళ్ళి గురించి మాత్రం చెప్పడంలేదు. ‘అసలు పెళ్ళి ప్రస్తావన ఎందుకు.?’ అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో అమాయకంగా ప్రశ్నించింది మలైకా అరోరా. మరోపక్క, లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెళ్ళి సన్నాహాల్లో బిజీగా వుందట ఈ బ్యూటీ. పెళ్ళి ఎక్కడ.? ఎలా.? అన్న విషయమై అర్జున్, మలైకా ఓ అవగాహనకు వచ్చారనీ, డిసెంబర్‌లో ఇద్దరి పెళ్ళీ విదేశాల్లో జరగొచ్చనీ అంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట ఈ ఇద్దరూ.