బి ద రియల్‌ మ్యాన్‌: విజయ్‌ దేవరకొండ చంటిపిల్లాడు!

మరిన్ని వార్తలు

‘నన్ను ఇంకా మా ఇంట్లో చంటి పిల్లాడిలానే చూస్తున్నారు. నన్ను ఏ పనీ చెయ్యనివ్వట్లేదు..’ అంటూ వాపోతున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. అతి తక్కువ కాలంలో అనూహ్యమైన స్టార్డమ్ దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ, ఇంట్లో ఖాళీగా కూర్చుని కరోనా క్వారెంటైన్‌ టైమ్ ని ఎలా గడుపుతున్నాడు.? అన్నది ఆసక్తికరమే.. అందుకే ఆ విషయాన్ని ఓ వీడియో ద్వారా చూపించబోతున్నాడట ఈ రౌడీ హీరో. ‘బి ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌ పేరుతో సెలబ్రిటీలు తమ ఇంటి పనులు చేసుకుంటూ, వాటి తాలూకు వీడియోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

 

ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివ, విజయ్‌ దేవరకొండని నామినేట్‌ చేసిన విషయం విదితమే. కొరటాల శివ తనను నామినేట్‌ చేయడంపై స్పందించిన రౌడీ హీరో, పై విధంగా వ్యాఖ్యానించాడు. ‘మా మమ్మీ నన్ను పని చెయ్యనియ్యట్లే.. పని డబుల్‌ అవుతుందట.. ఇంట్లో ఇంకా రియల్‌ మెన్‌లా చూడట్లే మమ్మల్ని. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. కానీ, లాక్‌డౌన్‌లో ఒక రోజుని గ్లింప్స్‌ ద్వారా చూపిస్తాను..’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నాడు. విజయ్‌ ఏం చూపించబోతున్నాడు.? అని ఇప్పుడు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ సినిమా చేస్తోన్న విషయం విదితమే. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS