అఫైర్‌ నిజమే: ఆమె ఒప్పేసుకుంది!

By iQlikMovies - June 27, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య బాలీవుడ్‌ సెన్సేషనల్‌ న్యూస్‌లో ఒకటైన అర్జున్‌కపూర్‌, మలైకా అరోరా ప్రేమ వ్యవహారం మౌత్‌ టాక్‌లో స్ప్రెడ్‌ అవుతుందే కానీ, ఇంతవరకూ వారిద్దరూ ఈ విషయమై అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది లేదు. ఆ మధ్య ఓ సారి అర్జున్‌కపూర్‌ ఇలాంటి న్యూస్‌ పట్ల మీడియాకి ఎందుకంత అత్యుత్సాహం అంటూ కాస్త గుస్సా అయిన సంగతి తెలిసిందే. కాదా మరి, అత్యుత్సాహమే. వయసులో తల్లి సమానురాలైన మలైకాతో లవ్వు అంటే అత్యుత్సాహం కాక ఇంకేంటి చెప్పండి.

 

సరే, ఈ విషయం పక్కన పెడితే, తాజాగా అర్జున్‌ కపూర్‌ బర్త్‌డే సందర్భంగా మలైకా పెట్టిన పోస్ట్‌కి నెటిజన్స్‌ నుండి వస్తున్న రిప్లైలు చూస్తే అంతే షాకవ్వాలి మరి. తాజాగా ఈ జంటపై 'మామ్‌ అండ్‌ సన్‌' అంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఈ రోజు అర్జున్‌కపూర్‌ బర్త్‌డే సందర్భంగా మలైకా చెప్పిన విషెస్‌ ఎలా ఉన్నాయంటే, 'హ్యాపీ బర్త్‌డే మై క్రేజీ ఇన్‌శాన్లీ, ఫన్నీ, అండ్‌ అమేజింగ్‌ అర్జున్‌కపూర్‌.. లవ్‌ అండ్‌ హ్యాపీనెస్‌ ఆల్వేస్‌..' అని మెసేజ్‌ పెట్టి, వీరిద్దరూ సరదాగా కలిసి దిగిన ఫోటో పోస్ట్‌ చేసింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor ... love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ఈ పోస్ట్‌తోనే ఆమె, అర్జున్‌కపూర్‌తో లవ్‌ని కన్‌ఫామ్‌ చేసేసిందంటూ నెటిజన్లు ఫిక్స్‌ అయిపోయారు. గతంలో ఓ సారి అర్జున్‌కపూర్‌ 'నాకు మలైకా వెరీ వెరీ స్పెషల్‌..' అంటూ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకానీ, అఫీషియల్‌గా వీరిద్దరి మధ్యా లవ్‌ని మాత్రం ఇద్దరూ కన్‌ఫామ్‌ చేయలేదు. అఫ్‌కోర్స్‌, వార్తల పరంగా వీరి మధ్య లవ్‌ అఫైర్‌. పెళ్లి పీటల దాకా కూడా వెళ్లిపోయిందనుకోండి. ఏది ఏమైతేనేం, మొత్తానికి మలైకా వైపు నుండి ఎక్స్‌పెక్ట్‌ చేయని ఇంకో డెవలప్‌మెంట్‌ వచ్చిందనుకోవాలి ఈ సందర్భంగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS