విజయనిర్మల పని రాక్షసి: మురళీమోహన్‌

మరిన్ని వార్తలు

సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మలను పని రాక్షసిగా అభివర్ణించారు సీనియర్‌ నటుడు మురళీమోహన్‌. నటిగా, దర్శకురాలిగా తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయ నిర్మల, అనారోగ్యంతో కన్ను మూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని తలచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

సీనియర్‌ నటుడు మురళీమోహన్‌, విజయ నిర్మలను బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు. నటిగా, దర్శకురాలిగా ఆమె సినీ పరిశ్రమకు అందించిన సేవలు చాలా గొప్పవని అన్నారు. సెట్‌లో ఆమె కమిట్‌మెంట్‌ చాలా గొప్పదనీ, ఆమెను పని రాక్షసి.. అని అభిమానంతో కొందరు పిలుచుకునేవారని మురళీమోహన్‌ చెప్పారు. సినీ పరిశ్రమలో ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో ఆమె చోటు దక్కించుకున్న వైనం గురించి ప్రస్తావిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు.

 

బాల నటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటించిన విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమకు లోటని నాటి, నేటి తారలు చెబుతూ ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణిగా ఎప్పుడూ ఎంతో హుందాగా కనిపిస్తూ, తెలుగు సినీ పరిశ్రమకు తానూ ఓ పెద్ద దిక్కుగా ఆమె వ్యవహరించేవారని మహిళా సినీ ప్రముఖులు అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS