బాలీవుడ్ సెన్సేషనల్ ప్రేమ జంటగా పాపులర్ అయిన అర్జున్ కపూర్ - మలైకా అరోరా విషయం మరోసారి హాట్ హాట్‌గా చర్చకొచ్చింది. అందుకు కారణం వీరి రిలేషన్ షిప్‌పై తాజాగా అర్జున్ కపూర్ రెస్పాండ్ కావడమే. వీరిద్దరి మధ్యా లవ్‌లాంటి బంధమేదో ఉందని ఇప్పటికే అందరికీ అర్దమైపోయింది. ప్రేమే కాదు. అంతకుమించి అని కూడా టాక్. అంతేకాదు, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారు.
అందుకు ఇరు కుటుంబ సభ్యులూ ఒకే చెప్పేశారట అనే ప్రచారం కూడా ఉంది. అయితే, తాజాగా అర్జున్ కపూర్ రెస్పాన్స్ సారాంశం ఏంటంటే, మలైకాతో తన రిలేషన్ నిజమే కానీ, పెళ్లి ఆలోచన మాత్రం ఇప్పుడప్పుడే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అర్జున్ కపూర్ రెస్పాన్స్‌కి ఒకింత ఫ్యాన్స్ షాక్ అయినా, ఆ వెంటనే తేరుకుని ఓహో.. అంటే, వీరిద్దరిదీ ఏదో కాంట్రాక్ట్ లవ్ స్టోరీ అయ్యుంటుందిలే అని లైట్ తీసుకున్నారు. అయితే, మలైకా మాజీ భర్త అర్భాజ్‌ఖాన్‌తో విడాకులకు ముందే, వీరిద్దరి మధ్యా లవ్ ఉందనీ సమాచారమ్.
అయితే విడాకుల అనంతరం ఆ లవ్ ముదిరి పాకాన పడిందట. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిన సంగతే. పార్కుల్లోనూ, పబ్బుల్లోనూ, రెస్టారెంట్స్‌లోనూ, విదేశీ లొకేషన్స్‌లోనూ విచ్చలవిడిగా రొమాంటిక్ చెట్టాపట్టాల్. అదీ సంగతి. ఇక వీరి లవ్ స్టోరీ సంగతిలా ఉంటే, మరోవైపు అర్జున్ కపూర్ కెరీర్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగానే గడుపుతున్నారు. అర్జున్ నటించిన 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మరోచిత్రం 'పానిపట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.