మలైకా ప్రొడక్షన్స్‌.. హాట్‌ హాట్‌ కరోనా ‘లడ్డూ’

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ మలైకా అరోరా అనగానే హాట్‌ హాట్‌ ఐటమ్ సాంగ్స్‌ గుర్తుకొస్తాయి. కానీ, ఇకపై ఎవరికైనా హాట్‌ హాట్‌ కరోనా లడ్డూలు గుర్తుకొస్తాయి. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి రావడంలో అందాల భామలు, తమ శరీరాన్ని ఫిట్‌గా వుంచుకునేందుకు నానా పాట్లూ పడాల్సి వస్తోంది. సరికొత్త ఫీట్లు చేయాల్సి వస్తోంది. ఇంటి పనులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చంటూ సరికొత్త పనులు చేస్తున్నారు అందాల భామలు. ఈ క్రమంలో మలైకా అరోరా, లడ్డూలు తయారు చేసింది ఇంట్లోనే. తన లడ్డూల ప్రిపరేషన్‌కి సంబంధించి సోషల్‌ మీడియాలో ఫొటోల్ని పోస్ట్‌ చేసింది ఈ బ్యూటీ.

 

వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం మలైకా అరోరా సొంతం. అయితే, ఈసారి మాత్రం మలైకా తన వయసుని బయట పెట్టేసుకోవాల్సి వచ్చింది. యాభైకి చేరువవుతున్న వయసుని కప్పి పుచ్చుకోవడమంటే ఆషామాషీ విషయం కాదు కదా.! ‘ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ నెంబర్‌..’ అని మలైకా ఎన్నిసార్లు నిరూపించినా, ఒక్క సారి ఆమె డీ గ్లామర్‌ లుక్‌లో కన్పిస్తే చాలు.. ఆమెకు వ్యతిరేకంగా ట్రోల్స్‌ పెరిగిపోతాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నట్టు, తన కంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో మలైకా ప్రేమలో పడిన విషయం విదితమే. పెళ్ళయి దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు పొందిన మలైకా, అర్జున్‌ కపూర్‌ని పెళ్ళాడే విషయంలో మాత్రం మీనమేషాల్లెక్కెడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS