ఈ మధ్య హీరోయిన్స్ డ్రస్సింగ్‌పై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇదంతా జరుగుతోంది. హీరోయిన్స్ డ్రస్సులు నచ్చకపోతే, సింపుల్‌గా నెటిజన్లు తిరస్కరిస్తున్నారు. తమకు తోచిన శైలిలో కామెంట్స్‌తో విసిగిస్తున్నారు. నెటిజన్స్ గుస్సా అవుతున్నారు కదా అని మన సెలబ్రిటీ భామలేమైనా తగ్గుతున్నారా.? అంటే అస్సలేమాత్రం తగ్గడం లేదు. కొందరైతే వారి నెగిటివ్ కామెంట్స్‌ని సైతం తెగ ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొందరు అప్పటికప్పుడే ఘాటైన సమాధానాలతో చర్చల్లో నిలుస్తున్నారు.
ఏది ఏమైనా సెలబ్రిటీల డ్రస్సింగ్ అంశం ఎప్పటికప్పుడే చర్చకొస్తోంది. మన అనసూయ మొదలుకొని, బాలీవుడ్ భామ జాన్వీకపూర్ వరకూ ఈ కామెంట్లు ఎదుర్కోక తప్పడం లేదు. తాజాగా 'పేట' భామ మాళవికా మోహనన్ కూడా ఈ ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంటోంది. మొన్నామధ్య ఓ హాట్ పోజులో ఫోటో పోస్ట్ చేస్తే ఆ ఫోటోకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి తాజాగా ధీటైన సమాధానమిచ్చింది. అంతకుమించిన హాట్ ఫోటోని పోస్ట్ చేసి, నేనింతే.. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను.
అయినా నేనెలాంటి దుస్తులు వేసుకోవాలో మీరెలా చెబుతారు.? అంటూ మండి పడింది. ఈ భామ విజయ్‌దేవరకొండతో 'హీరో' సినిమాలో నటిస్తోంది. అమ్మడి తీరు చూస్తుంటే, విజయ్దేవరకొండలాగే స్పెషల్ ఆటిట్యూడ్ ప్రదర్శిస్తున్నట్లుంది అప్పుడే.