స్టార్ హీరో స్టేటస్ ని పక్కన పెట్టి ప్రయోగాత్మక చిత్రాలు చేసే హీరో నాగార్జున. మొదటి నుంచి ఒకే మూస తరహా సినిమాల్లో కాకుండా, విభిన్న కథలతో, కొత్త డైరక్టర్స్ కి ఛాన్స్ ఇస్తూ , అందరి హీరో అనిపించుకున్నారు నాగ్. ఒక వైపు సినిమాలు , మరొక వైపు రియాల్టీ షో లతో ఫాన్స్ ని అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా తన జర్నీ కొనసాగిస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో, వ్యాఖ్యాతగా అలరించారు ఈ మన్మథుడు, నెక్స్ట్ బిగ్ బాస్ రియాలిటీ షో తో హోస్ట్ గా మారి విపరీత మైన క్రేజ్ సంపాదించుకున్నారు. వీకెండ్స్ లో కేవలం నాగార్జున కోసం ఈ షో చూసే వారున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య నాగ్ కెరియర్ కాస్త డౌన్ అయ్యింది. వరుస అపజయాలు వెంటాడుతున్నాయి. రీసెంట్ గా నా సామి రంగ మూవీతో విజయం అందుకున్నారు. ప్రజంట్ నాగార్జున తీసుకున్న ఒక నిర్ణయం ఫాన్స్ ని కలవర పెడుతోంది.
నాగ్ తరం హీరోలంతా సోలోగా వచ్చి హిట్స్ కొడుతుంటే, తాను మాత్రం మల్టీ స్టారర్ సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. నాగార్జున ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. సీతా రామ రాజు, నిన్నే ప్రేమిస్తా, రావోయి చందమామ, స్నేహ మంటే ఇదేరా, మనం, బంగార్రాజు, ఊపిరి తదితర సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా వాటి పైనే ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర, సంక్రాతి బరిలో దిగిన 'నా సామి రంగా' మల్టీ స్టారర్ సినిమాలే. నెక్స్ట్ కూడా తాను చేయబోయే సినిమాలు ఈ కోవకు చెందినవే. కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న“కుబేర” మూవీలో నాగార్జున ఒక కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మరో తమిళ సినిమాలో కూడా నాగార్జున ఒక మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు, కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు మూవీలో కూడా నాగార్జున గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని ఫిలిం నగర్ సమాచారం. నా సామి రంగ తరవాత ఇప్పటివరకు నాగ్ సోలోగా ఏ మూవీ కమిట్ అవలేదు. సోలోగా హిట్స్ రావటం లేదని, ఇలా ఇతర హీరోలతో కలిసి మూవీస్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ తరహా సినిమాలు హిట్స్ తో పాటు, పేరుని కూడా తెచ్చి పెడుతున్నాయని నాగ్ భావిస్తున్నారట. ఊపిరి, బంగార్రాజు, మనం , నా సామి రంగా, బ్రహ్మాస్త్ర, ఇవన్నీ హిట్ అవటంతో పాటు నాగార్జునకి ఉన్న ఇమేజ్ ని పెంచాయి. అందుకనే నాగ్ కూడా వీటికి ఓకే చెప్తున్నట్టు టాక్.