‘నేల టిక్కెట్టు’ బ్యూటీ ‘ఇస్మార్ట్‌’ రొమాన్స్ కలిసొచ్చేనా!

మరిన్ని వార్తలు

‘నేల టికెట్టు’ సినిమాతో రవితేజ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్ని తన మాయలో పడేసిన బ్యూటీ మాళవికా శర్మ. సినిమా హిట్‌ కాలేదు. కానీ, ఈ కొత్త పాప చేసిన మాయాజాలాన్ని మాత్రం అంత తొందరగా మర్చిపోలేదు ఆడియన్స్‌. సినిమా సంగతెలా ఉన్నా, ప్రమోషన్స్‌లో మాళవికా శర్మ చేసిన గ్లామర్‌ హంగామా అంతా ఇంతా కాదని చెప్పాలి. ఆ సంగతి అటుంచితే, తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తోంది. ‘రెడ్‌’ సినిమాలో రామ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ రామ్‌తో కలిసి పిచ్చ పిచ్చగా రొమాన్స్‌లో మునిగి తేలుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో హిట్‌ కొట్టి, రామ్‌ ఫుల్‌ స్వింగ్‌ మీదున్నాడు.

 

రెండు సినిమాల్లో నటించినా దక్కని హిట్‌ రామ్‌తో జత కట్టి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో కొట్టింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. అలాగే, మాళవికా శర్మ కూడా నక్కతోక తొక్కితే, ‘రెడ్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టే కళ కనిపిస్తోంది. మరి మాళవికకు రామ్‌ హిట్‌ ఇస్తాడా.? చూడాలి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో రామ్‌ కనిపించనున్నాడనీ టీజర్‌ ద్వారా అర్ధమైంది. అన్నట్లు మరో భామ నివేదా పేతురాజ్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS