‘రెడ్’ సినిమాలో మాళవిక శర్మతోపాటు నివేదా పేతురాజ్, అమృత అయ్యర్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఓ స్పెషల్ సాంగ్‌లో హెబ్బా పటేల్ కూడా మెరిసింది. ఇంత గ్లామర్ నడుమ, అందరి కంటే ఎక్కువ పబ్లసిటీ మాళవిక నాయర్ సొంతం చేసుకుందంటే అది విశేషమే మరి. నిజానికి, మాళవిక శర్మ కంటే కాస్త ఎక్కువగా మూవీ ప్రమోషన్స్‌లో నివేదా పేతురాజ్ కనిపించింది. అయినాగానీ, మాళవిక తన క్యూట్ అప్పీల్‌తో కుర్రకారు గుండెల్ని టచ్ చేసింది. మాళవిక శర్మకి తెలుగులో తొలి సినిమా రవితేజ హీరోగా నటించిన ‘నేల టిక్కెట్’.
అయితే, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆమె కొంత కాలం సరైన అవకాశం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ అంచనాల్ని అందుకోలేకపోయినా, మాళవికకి మంచి అవకాశాలే వస్తున్నాయట టాలీవుడ్‌లో. అందానికి అందం.. దాంతోపాటే నటనా ప్రతిభ.. ఇవన్నీ వుండడమే మాళవికకి అడ్వాంటేజ్ అయ్యాయనే చర్చ జరుగుతోంది. అయితే, హిట్టొస్తేనే ఏ హీరోయిన్ అయినా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతుంది.
కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే, అనూహ్యంగా వచ్చిన ఆ కాస్త ఫాలోయింగ్ కూడా అటకెక్కిపోయే ప్రమాదముందని మాళవిక గుర్తెరగాలి. కాగా, ఉన్నత విద్య కోసమే కెరీర్లో చిన్న బ్రేక్ తీసుకున్నాను తప్ప, ‘నేల టిక్కెట్’ ప్లాప్ అవడంతో కాదని అంటోంది ఈ బ్యూటీ. అన్నట్టు ఈ బ్యూటీ క్లాసికల్ డాన్సర్.. అలాగే లా స్టూడెంట్ కూడా.