బన్నీతో డాన్స్, ఆ కిక్కే వేరు.. మరి చరణ్, తారక్..?

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో స్టెప్పులేసింది.. సూపర్ స్టార్ మహేష్‌బాబుతోనూ ఆడి పాడింది.. అయితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డాన్స్ అంటే ఆ కిక్కే వేరప్పా.. అంటోంది అందాల భామ పూజా హెగ్దే. బన్నీతో పూజా రెండు సినిమాల్లో నటించింది. ఒకటి ‘డిజె దువ్వాడ జగన్నాథం’ కాగా, ఇంకోటి ‘అల వైకుంఠపురములో’. ఓ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.. ఇంకోటి బంపర్ హిట్ అయ్యింది. అన్నట్టు, పూజా హెగ్దే ‘రంగస్థలం’ సినిమా కోసం రామ్ చరణ్‌తో ‘జిగేలు రాణి’ పాట కోసం స్పెషల్‌గా చిందులేసిన విషయం విదితమే.

 

డాన్సుల్లో ఎన్టీఆర్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు.. రామ్ చరణ్ డాన్సుల్లో గ్రేస్ చాలా ఎక్కువ.. అల్లు అర్జున్‌తో డాన్సులు స్టయిలిష్‌గా అనిపిస్తాయి.. అని చెప్పిన పూజా హెగ్దే, ఇంకోసారి అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాననీ, ఆ ఛాన్స్ త్వరలోనే వస్తుందనీ ఆకాంక్షించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘డార్లింగ్’ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తోన్న విషయం విదితమే. అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ పూజా హెగ్దేనే హీరోయిన్.

 

నెంబర్ గేమ్‌ని తాను నమ్మబోనంటున్న పూజా హెగ్దే, కెరీర్‌లో ఈ ఫేజ్‌ని తాను ఎంజాయ్ చేస్తున్నాననీ, తెలుగులో మాట్లాడటం తనకు అదనపు అడ్వాంటేజ్‌గా మారిందనీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. కెరీర్‌లో ఇంకా సాధించాల్సింది చాలా వుందని చెప్పుకొచ్చింది పూజా హెగ్దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS