సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మోహన్ లాల్ 'లూసిఫర్' చిత్రం..!!

By iQlikMovies - April 05, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'. ఇప్పటికే మలయాళం లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది... ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. 

 

మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్,  టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన ఈ సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS