ద్వితీయ విఘ్నం తప్పింది... సమ్మర్‌ ఊపిరి పీల్చుకుంది.!

మరిన్ని వార్తలు

'మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. మాదిరి ఉత్కంఠ రేపిన సమ్మర్‌కి మంచి బోణీ కొట్టింది 'మజిలీ' సినిమా. ఈ సమ్మర్‌కి సినిమాలు క్యూ కట్టనున్నాయి. సమ్మర్‌కి తొలి బోణీగా వచ్చిన 'మజిలీ'కి మంచి టాక్‌ వచ్చింది. కూల్‌ సమ్మర్‌ సినిమా చూశామంటూ సినిమా చూసినవారంతా హ్యాపీ ఫీలవుతున్నారు. అన్ని వైపుల నుండీ పోజిటివ్‌ రివ్యూలే వస్తున్నాయి 'మజిలీ'కి. చై, శామ్‌ పెళ్లి తర్వాత తొలిసారి జతకట్టిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలున్నాయి. 

 

కానీ ఆ అంచనాల్ని అందుకుంటుందో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. 'నిన్ను కోరి' వంటి డిఫరెంట్‌ అండ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీని అందించిన దర్శకుడు శివ నిర్వాణ చై, శామ్‌ కోసం రాసుకున్న కథ కూడా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక బోణీ బాగుంది కాబట్టి, ఈ సమ్మర్‌ వెనక్కి తిరిగి చూడక్కర్లేదని సినీ ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

 

తర్వాత రానున్న ప్రేమకథా చిత్రమ్‌ 2' కూడా మంచి విజయం అందుకుంటే, ఈ వారం బాక్సాఫీస్‌ గలగలకు లేటు లేనట్లే. ఇక వచ్చే వారం మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి'తో రానున్నాడు. తర్వాత విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌', మహేష్‌ 'మహర్షి', నిఖిల్‌ 'అర్జున్‌ సురవరం', తదితర సినిమాలతో పాటు, చిన్నా చితకా సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. అన్ని సినిమాలూ సక్సెస్‌ అయితేనే కదా బాక్సాఫీస్‌ కాసులతో కళకళలాడేది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS