దెయ్యం పిల్ల సమంతకు పోటీ అవుతుందా.?

మరిన్ని వార్తలు

సమంత 'మజిలీ' సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉందనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. ఇక రేపు అనగా ఏప్రిల్‌ 6న మరో ముద్దుగుమ్మ భయపెడుతూ రేస్‌లోకి దిగుతోంది. ఆ ముద్దుగుమ్మే నందితా శ్వేత. 'ప్రేమ కథా చిత్రమ్‌ 2'తో ప్రేక్షకుల ముందుకు రానుందీ పిల్ల. అమ్మో ఆ పిల్లా.? ఆ పిల్ల కళ్లు చూస్తేనే భయం. అసలే దెయ్యం. అనుకుంటున్నారా.? అవునులెండి దెయ్యమే కానీ, ఈ దెయ్యం పిల్ల చాలా మంచిదండీ. భయపెట్టడమే కాదు, మంచిగా నవ్విస్తుంది కూడా. 

 

ఈ చిలిపి దెయ్యం చేసే చిలిపి చేష్టలు ఈ సమ్మర్‌లో నవ్వులు పూయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమంత్‌ అశ్విన్‌, నందితా శ్వేత, సిద్దీ ఇద్నానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా 'ప్రేమకథా చిత్రమ్‌'కి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా అనూహ్యంగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంతకు మించి, ఈక్వెల్‌ రేషియోలో హారర్‌ ప్లస్‌ కామెడీతో రూపుదిద్దుకుందనీ, నందితా శ్వేతనే స్వయంగా చెబుతోంది. ఫిఫ్టీ ఫిప్టీ కామెడీ, హారర్‌ అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా నవ్వుకోవడం ఖాయమంటోంది. 

 

ఇక ఒక్కరోజు ముందుగా విడుదలైన సమంత 'మజిలీ'కి మంచి టాక్‌ వస్తే ఫర్వాలేదు. రిజల్ట్‌ ఏమాత్రం కాస్త అటూ ఇటూ అయినా, ఈ దెయ్యం పిల్లకి క్రెడిట్‌ దక్కినట్లే. ఎందుకంటే అసలే ఈ మధ్య సినిమాల్లేక బోర్‌ ఫీలవుతున్న ఆడియన్స్‌కి 'ప్రేమకథా చిత్రమ్‌ 2' స్పెషల్‌ రిలీఫ్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది. ప్రచార చిత్రాల ద్వారా ఆ నమ్మకాన్ని క్రియేట్‌ చేసింది చిత్రయూనిట్‌. అలాగని సమంతను తక్కువంచనా వేయడానికి లేదు. ఎమోషనల్‌ టచ్‌తో 'మజిలీ' ప్రమోషన్స్‌ కూడా బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఆడియన్స్‌ ఫైనల్‌ వర్డిక్ట్‌ ఎలా ఉంటుందనేది సాయంత్రానికి గానీ తెలీదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS