మెగా హీరో కోసం మళ్లీ మలయాళీ భామ.?

మరిన్ని వార్తలు

మెగా కాంపౌండ్‌ నుండి హీరోగా పరిచయమవుతోన్న మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌. ఇటీవల వైష్ణవ్‌ తేజ్‌ సినిమా లాంఛనంగా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. మత్యకారుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వైష్ణవ్‌కి జోడీగా నటించే ముద్దుగుమ్మ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ పేరు తెర పైకి వచ్చింది. ఆమె పేరు దేవికా సంజయ్‌, మలయాళీ భామ.

 

ప్రస్తుతం మలయాళీ ముద్దుగుమ్మల హవా తెలుగు తెరపై ఎక్కువైపోయింది. పాపులర్‌ హీరోయిన్స్‌గా కొనసాగుతున్న ముద్దుగుమ్మలంతా మలయాళం నుండి తెలుగులోకి వచ్చినవాళ్లే. ఇకపోతే దేవిక సంజయ్‌కి ఆల్రెడీ మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. కానీ తెలుగులో ఇదే తొలి సినిమా కానుంది. ఫేస్‌లో ఫ్రెష్‌ అప్పీల్‌ ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకునేందుకు కారణమైందట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ భామ మెగా హీరోతో కలిసి తెరంగేట్రం చేయనుందన్న మాట. ఇకపోతే ఈ సినిమాకి 'జాలరి' అనే పేరు పరిశీలిస్తున్నారు. సినిమా అనౌన్స్‌ చేస్తూ, విడుదల చేసిన హీరో ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS