టాలీవుడ్ కి రానున్న మరో మలయాళీ అందం.

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో మలయాళీ భామల హవా కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ ముద్దుగుమ్మలంతా మలయాళం నుండి దిగుమతి అయిన వారే. ఇక ఇప్పుడు మరో మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని అలంకరించడానికి రాబోతోందట. ఆమె పేరు మానస రాధాక్రిష్ణన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ’వకీల్ సాబ్‘ సినిమా పూర్తి కాగానే హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుందట. ఈ లోగా హరీష్ శంకర్ గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ పేరును ఫైనల్ చేసేశాడు.

 

ది బెస్ట్ కాంబినేషన్ అయిన హరీష్ అండ్ దేవి శ్రీ కాంబినేషన్ లో మరోసారి ఈ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ దద్దరిల్లిపోనుంది. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం మలయాళీ భామ మానసరాధాక్రిష్ణన్ ని పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ఎంచుకునే యోచనలో హరీష్ అండ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మానస రాధాక్రిష్ణన్ మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. యాక్టింగ్ టాలెంట్ తో పాటు, గ్లామర్ పాళ్లు కూడా పాపలో కూసింత ఎక్కువే. సో టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ఇంతకన్నా కావల్సిందేముంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS