ఇప్పుడు ఎక్కడ విన్నా ఆమె గురించే చర్చ. అంతగా టాలీవుడ్‌ని ఎట్రాక్ట్ చేసింది ఆ ముద్దుగుమ్మ. తొలి సినిమాకే ఈ స్థాయిలో ఏ హీరోయిన్ గురించి చర్చ జరగలేదు కాబోలు. ముద్దుగుమ్మ సాయి పల్లవి విషయంలో అది జరుగుతోంది. 'ప్రేమమ్' సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన యాక్టింగ్ టాలెంట్‌ని ప్రూవ్ చేసేసుకుంది. అయితే మొదట్లో టాలీవుడ్‌కి సరిపడా హీరోయిన్ మెటీరియల్ కాదు సాయి పల్లవి అనుకున్నారంతా. కానీ సినిమా విడుదలయ్యాక ఈక్వేషన్స్ మారిపోయాయి. 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి అంతగా టాలీవుడ్‌ని మెస్మరైజ్ చేసేస్తోంది. శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా అని 'ఫిదా'కి పబ్లిసిటీ చేశారు సినిమా విడుదలకి ముందు. కానీ విడుదలయ్యాక, సాయి పల్లవి హీరోయిన్ సెంట్రిక్ మూవీ అనే స్థాయికి చేరిపోయిందంటే, సాయి పల్లవి మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా ఇంత సక్సెస్ కావడానికి సాయి పల్లవి నటనే కారణం అంటోంది టాలీవుడ్. ఫస్ట్ సినిమాతోనే ఇంతగా ఏ హీరోయిన్ ప్రశంసలు దక్కించుకోలేదు అనే చెప్పాలి ఇంతవరకూ. ఫస్ట్ సినిమాతోనే ఇలా ఉంటే, ఇక నెక్స్ట్ సినిమాలకి సాయి పల్లవి టాలెంట్ ఏ స్థాయిలో చూపించేస్తుందో కదా. అయితే యాక్టింగ్ వరకూ ఓకే. కానీ అమ్మడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అంతగా సూట్ కాదు. గ్లామరస్ క్యారెక్టర్స్ సాయి పల్లవికి మైనస్ అనే చెప్పాలి. టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా దూసుకెళ్లాలంటే గ్లామర్ తప్పని సరి. ఏమో ఏం చెప్తాం.. టాలెంట్ ఉంటే గ్లామర్‌తో పనేంటి అని కూడా అనిపించక మాననిపిస్తోంది సాయి పల్లవిని చూస్తుంటే.