అవును 'నేల టిక్కెట్టు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మాళవికా శర్మకు సో బిజీనే. అయితే సినీ కెరీర్ పరంగా కాదు. విషయమేంటంటే, ఈ బ్యూటీకి యాక్టింగ్ ఒక్కటే మెయిన్ గోల్ కాదట. తన ఫ్యూచర్ వేరే ఉందంటోంది. ఫ్యూచర్‌లో ఓ పెద్ద లాయర్‌గా స్ధిరపడాలనేది ఈ ముద్దుగుమ్మ గోల్ అట. ప్రస్తుతం లా చదువుతోన్న ఈ బ్యూటీ షూటింగ్ సమయంలో కొంచెం టైం దొరికినా, పుస్తకాలతో కుస్తీ పట్టేసేదట.
యాక్టర్ కాకుంటే, డాక్టర్ అయ్యేదాన్ని అనే మాట చాలా క్యాజువల్‌గా నటీనటులు చెప్పే మాట. అయితే మాళవికా శర్మ మాత్రం అలా చెప్పడం లేదు. ఓ పక్క యాక్టింగ్ చేస్తూనే, మరో పక్క లా స్టూడెంట్‌గానూ రాణిస్తానంటోంది. చూశారుగా ఈ ఫోటోలో ఆమె ఎంత శ్రద్ధగా చదివేసుకుంటుందో. చాలా మంది ముద్దుగుమ్మలు ఈ మధ్య యాక్టింగ్‌ని టెంపరరీ కెరీర్‌గానే ఎంచుకుంటున్నారు.
మొన్న 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి కూడా అంతే. 'ఫిదా' సినిమా తర్వాత చదువుపై కాన్‌సన్‌ట్రేషన్ చేసింది. ఎన్ని క్రేజీ ఆఫర్స్ వచ్చినా, ఈజీగా రిజక్ట్ చేసి, మెడిసన్ పూర్తి చేశాకే, తిరిగి యాక్టింగ్ వైపు దృష్టి పెట్టింది. అలాగే మాళవికా శర్మ కూడా ప్రస్తుతం 'లా' పూర్తి చేసే పనిలో ఉందట.
ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన 'నేల టిక్కెట్టు' సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, గ్లామర్ పరంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. విడుదలకు ముందే తన హాట్ అప్పీల్‌తో వావ్ అనిపించింది. సినిమా విడుదలయ్యాక యాక్టింగ్ పరంగా కూడా ఓకే అనిపించుకుంది. కానీ సినిమా అనుకున్నంతగా విజయం సాధించి ఉంటే, అమ్మడి సీను మరోలా ఉండేది.
చూడాలి మరి, ముందు ముందు మాళవిక ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో.!