ర‌వితేజ హీరోయిన్‌తో.. సాయిధ‌ర‌మ్ రొమాన్స్

By iQlikMovies - May 27, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'నేల టికెట్‌' తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళ‌విక శ‌ర్మ‌. ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో మాళ‌విక‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎట్ట‌కేల‌కు ఆమెకు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మాళివిక మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌ల‌సి న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది.

 

`ప్ర‌తీరోజూ పండ‌గే` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా మాళ‌విక ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లుకానుంది. తండ్రీ త‌న‌యుల అనుబంధం నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. కుటుంబ బంధాలు, మాన‌వ‌సంబంధాల‌కు మారుతి పెద్ద పీట వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మాళ‌విక ఎంట్రీపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS