పవన్‌కళ్యాణ్‌ కూడా పాదయాత్ర చెయ్యాల్సిందేనా?

మరిన్ని వార్తలు

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పాదయాత్ర చేయాలనే ఆలోచనలో వున్నారు. 'గ్రామ యాత్ర' పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా పర్యటించబోతున్నారు పవన్‌కళ్యాణ్‌. దీనికోసం జనసేన పార్టీ సీనియర్‌ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. అతి త్వరలోనే పవన్‌కళ్యాణ్‌ గ్రామ యాత్రకు సంబంధించి ఓ ప్రకటన అధికారికంగా జనసేన నుంచి రాబోతోందని సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతోనే ముఖ్యమంత్రి అయ్యారు.

 

ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా వైఎస్‌ జగన్‌ కూడా పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నారు, ముఖ్యమంత్రి పీఠమెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌పై కూడా పాదయాత్ర చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది పార్టీ నేతలనుంచి. అయితే వైఎస్‌ జగన్‌లా పవన్‌కళ్యాణ్‌ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా? అందుకు తగిన ఆర్థిక వనరులు జనసేన పార్టీకి వున్నాయా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

 

పాదయాత్ర కంటే ముందు ఓ సినిమాలో నటించాలని పార్టీ నేతలు, పవన్‌కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి కూడా పవన్‌కళ్యాణ్‌ తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారని సమాచారమ్‌. పవన్‌కళ్యాణ్‌ కోసం దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది నిర్మాణ సంస్థలు, డజనుకు పైగా దర్శకులు సిద్ధంగా వున్నారు. జనసేనాని పాదయాత్ర చేస్తారా? పవర్‌ స్టార్‌ సినిమా చేస్తారా? రెండూ కలిసి చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS