నాగార్జున హీరోగా రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు2’. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్ అని గతంలో కధనాలు వినిపించాయి. ఆ సినిమా లైన్ కాపీ చేసుకొని ‘మన్మథుడు2' డెవలప్ చేశారని వినిపించింది. ఈ విషయంపై నాగార్జున పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సినిమా రీమేక్ అని తేల్చేశారు. అయితే ఈ సినిమాను ఎక్కడి నుంచో కాపీ కొట్టామని కొందరు అంటున్నారని, ఇందులో వాస్తవం లేదని, రైట్స్ కొనుగోలు చేసి ఈ చిత్రం చేశామని చెప్పారు. '' ‘ప్రిటీ-మోయ్ తా మెయిన్’ అనే ఫ్రెంచ్ చిత్రం ‘మన్మథుడు2’కి మూలం. ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్‌ను స్టూడియో కెనాల్ నుంచి కొనుగోలు చేశాం.
ఏడాది పాటు మనకు తగినట్లుగా కథ సిద్ధం చేశాం. రాహుల్‌ను డైరెక్టర్ అనుకున్న తర్వాత తను మమ్మల్ని కలిసినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న ‘మన దగ్గర రైట్స్ ఉన్నాయా’ అని. ‘నేను ఎవరో చేసిన క్రియేషన్‌ను కొట్టేసే రకం కాదు. ఇవిగో రైట్స్’ అని అన్నీ చూపిస్తే గానీ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు'' అని వివరంగా చెప్పారు నాగ్.