'మన్మధుడు 2' గతంలో వచ్చిన 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్ అనుకున్నారంతా. కానీ, కొన్ని పోలికలున్నప్పటికీ, కథ పరంగా చూస్తే, చాలా తేడాలున్నాయి. చాలా ఏంటీ.? అసలు పొంతనే లేదు రెండు కథలకీ. ఇంతకీ తాజా విషయమేంటంటే, అసలీ కథ 'మన్మధుడు' కి సీక్వెల్ కాదట. ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ అని స్వయంగా నాగార్జునే చెప్పారు. ఆగస్ట్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమయం చాలానే ఉన్నా, లేదు మిత్రమా..సమయమిదే.. అంటూ నాగార్జున ప్రమోషన్స్ జోరు పెంచేశారు. వరుస పెట్టి సినిమా అప్డేట్స్ వదులుతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడితో ప్రమోషన్స్ ఆగవట. ఇంకా ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉంటాడట. అంతేకాదు, ప్రమోషన్స్‌లో నాగార్జున కొన్ని కొత్త స్ట్రేటజీలను ఫాలో చేయనున్నాడట.
అవేంటో ప్రస్తుతానికి సస్పెన్స్ అట కానీ, త్వరలోనే తెలుస్తాయి కదా అని ఊరిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాగార్జున లుక్సే టాక్ ఆఫ్ ది టాపిక్ అయ్యింది. కథలో వయసు మళ్లిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌గా నాగ్ క్యారెక్టర్ డిజైన్ చేసినా, ఆల్వేస్ నాగ్ మన్మధుడేగా. అందుకే హ్యాండ్సమ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్నాడు.