సూపర్ స్టార్ కృష్ణ సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మనసుకు నచ్చింది'. ఓ స్వీట్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీ. మనసుకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయనీ గతంలోనే మంజుల చెప్పింది. కాగా తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ లుక్ నిజంగానే అందరి మనసుకు నచ్చేలా ఉంది. ఓ కొండపైన హీరో, చేతిలో కెమెరాతో నిలబడి ఉన్నాడు. కింద హీరోయిన్ కూర్చొని ఉంది. ఈ ఇద్దరూ వెనక్కి తిరిగి ఉన్న లుక్ ఇది. చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. స్వచ్ఛమైన ఆకాశంలో విహరించే పక్షులు, చుట్టూ చెట్లు వర్ణించేందుకు మాటలు చాలని హాయైన వాతావరణం అది.
ఇలా ఈ లుక్‌తో ఫస్ట్ అటంప్ట్‌తోనే మంజుల ఆకట్టుకుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. అమైరా దస్తూర్, త్రిధా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రీలుక్‌లో సందీప్‌కిషన్‌తో పాటు ఉన్నది ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. కాగా ఈ సినిమాతో మంజుల కూతురు జాహ్నవి కూడా నటిగా పరిచయం కాబోతోంది. జాహ్నవి ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. ఇంతవరకూ నటిగా, నిర్మాతగా తానేంటో ప్రూవ్ చేసుకున్న మంజుల తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం 'మనసుకు నచ్చింది'.
ఈ సినిమా పట్టాలెక్కించేందుకు మంజుల చాలా కష్టపడిందట. ఎంతో మధనపడిందట. ప్రతీ క్యారెక్టర్‌నీ ఎంతో చక్కగా డిజైన్ చేసిందట మంజుల. సినిమాని సినిమాగా కాకుండా నేచురల్‌గా తెరకెక్కించాలనేది మంజుల తపన. ఆ తపన అంతా సినిమాలోని ప్రతీ క్యారెక్టర్స్‌లో ఖచ్చితంగా కనిపిస్తుందంటోంది మంజుల. ప్రీ లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ని బట్టి చూస్తుంటే, ఈ సినిమాతో మంజుల అందరి మనసుల్ని గెలచుకోవడం ఖాయమనిపిస్తోంది.