సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది? గతేడాది డిశంబర్ 9న రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'ధృవ' రిలీజ్ అయ్యింది. ఘన విజయం సాధించింది. ఏడాది చివర్లో వచ్చినా మంచి విజయాన్ని బాక్సాఫీస్ లిస్టులో వేసింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమా సంగతి ఎందుకు చర్చకొచ్చిందంటే.. ఈ రోజు అనగా డిశంబర్ 8న ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న 'రంగస్థలమ్' సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్. ఎందుకంటే రీజన్ ఇదీ అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఫస్ట్‌లుక్ విడుదలవ్వాల్సి ఉంది.
అయితే రేపటికీ, ఈ రోజు సాయంత్రానికి టైమ్‌లో పెద్దగా డిఫరెన్స్ లేదు. కొన్ని గంటలు మాత్రమే డిఫరెన్స్. అయితే సెంటిమెంట్ పరంగా ఈ స్మాల్ ఛేంజ్ ఎంత వర్కవుటవుతుందో తెలీదు. అసలింతకీ ఈ గాసిప్ నిజమో కూడా తెలీదు. ఏమో టెక్నికల్ కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఇలా లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైతేనేమి ప్రస్తుతానికి 'రంగస్థలమ్' ఫస్ట్‌లుక్ పోస్ట్‌పోన్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 1985 కాలం నాటి ఓ క్యూట్ లవ్‌స్టోరీ. ప్రయోగాత్మక చిత్రం.
చరణ్ అచ్చమైన పల్లెటూరి కుర్రోడి పాత్రలో కనపించబోతున్నాడు. ఇంతవరకూ చరణ్ పోషించని సరికొత్త క్యారెక్టర్ ఇది. లుక్ కూడా క్వైట్ డిఫరెంట్. ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిసారి సమంత, చరణ్‌తో జత కడుతోన్న చిత్రం కూడా ఇది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాని రూపొందిస్తోంది. హాట్ బ్యూటీ అనసూయ, యంగ్ హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో. 2018 మార్చిలో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.