రొమాంటిక్‌ 'ఘాటు' ఎక్కువేనేమో

మరిన్ని వార్తలు

'మనసుకు నచ్చింది' అంటూ కూల్‌ టైటిల్‌ పెట్టి సినిమా తెరకెక్కిస్తోన్న సూపర్‌ స్టార్‌ కృష్ణగారమ్మాయ్‌ మంజుల, దీన్నొక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మలచినట్లు అర్థమవుతోంది. సినిమాలో హాట్‌ బ్యూటీస్‌ అమైరా దస్తుర్‌, త్రిధా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో రొమాంటిక్‌ కంటెంట్‌ ఎక్కువే ఉండబోతోందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. 

ఈ తరం యూత్‌ఫుల్‌ మూవీస్‌ అన్నీ రొమాంటిక్‌ సెన్స్‌ విషయంలో ఓ అడుగు ముందే ఉంటున్నాయి. యూత్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయాలంటే ఆ మాత్రం రొమాంటిక్‌ సెన్స్‌ తప్పనిసరైపోయింది. అయితే కథానుగుణంగా సినిమాలో రొమాంటిక్‌ కంటెంట్‌ ఉంటుందే తప్ప, ఏదీ ఓవర్‌ ది బోర్డ్‌ ఉండబోదని మంజుల అండ్‌ టీమ్‌ నుంచి సమాచారం అందుతోంది. ఇంకో వైపున సినిమా ప్రోమోస్‌లో ఫీల్‌ గుడ్‌ కంటెంట్‌ ఎలాగైతే కనిపిస్తోందో, గ్లామరస్‌ కంటెంట్‌ కూడా అంతకు మించే కనిపిస్తుండడం గమనించాల్సిన అంశం. 

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లోనూ హీరోయిన్‌ బికినీలో దర్శనమివ్వడమే కాకుండా హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్‌ సీన్స్‌ కూడా బలంగా కనిపిస్తున్నాయి. అమైరా దస్తుర్‌కి ఇదే తొలి సినిమా కాగా, త్రిధా చౌదరి గతంలో 'సూర్య వర్సెస్‌ సూర్య' సినిమాలో హీరో నిఖిల్‌ సరన నటించింది. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ యువ నటుడిగా దూసుకెళ్తున్న సందీప్‌ కిషన్‌, ఈ 'మనసుకు నచ్చింది'పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. త్వరలో 'మనసుకు నచ్చింది' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS