Manchu Family: ఇక మంచు ఫ్యామిలీ పని ఇంతేనా..?

మరిన్ని వార్తలు

మెగా ఫ్యామిలీ అంత కాకపోయినా మంచు ఫ్యామిలీ కి కూడా టాలీవుడ్ లో గుర్తింపు వుంది. తెలుగు చిత్ర సీమలో మోహన్ బాబు ది 40 ఏళ్ళ జైత్ర యాత్ర . నటుడిగా నిర్మాతగా ఆయన ఎన్నో ఘన విజయాలు సాధించారు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన వారసులు మాత్రం... మోహన్ బాబు లెగసి ని కొనసాగించ లేక పోతున్నారు. విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్న ఏవో కొన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. హిట్టు, ఫ్లాపులు మనచేతుల్లో వుండవు. అందరికీ అవి సహజమే. కానీ మరీ ఇంత దారుణమైతే.. ఎవరి విషయం లో జరగలేదేమో.

 

సన్ అఫ్ ఇండియా సినిమా భారీ ట్రోలింగ్ కి గురైయింది. ఈ సినిమా కి అడ్వాన్ బుకింగ్ ఓపెన్ చేస్తే... ఒక్క టికెట్ కూడా తెగక పోవడం తో ఆ ఫామిలీ నవ్వులపాలు ఐంది. ఇప్పుడు విష్ణు సినిమా పరిస్థితి కూడా అంతే. జిన్నా ని ఎవ్వరు పట్టించుకోలేదు. కనీసం సన్నీ లియోన్, పాయల్ రాజపుట్ కోసమైనా ఈ సినిమా చూడలేదు. అసలు మంచు హీరోల సినిమాల్ని ప్రేక్షకులు పట్టించుకునే స్థితిలో లేరనే విషయం స్పష్టంగా అర్దమైయింది. మంచు మనోజ్ ఆల్రెడీ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. లక్షి ప్రసన్న కూడా అంతే. చూస్తుంటే.. మంచు కుటుంబ వైభవం మంచులా కరిగిపోయినట్టే అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS