హాట్‌ అండ్‌ 'స్పైసీ' షోకి హోస్ట్‌గా మంచు వారమ్మాయ్‌.

మరిన్ని వార్తలు

సెలబ్రిటీల పర్సనల్‌ ఇష్యూస్‌ని తెలుసుకోవడం ఫ్యాన్స్‌కి ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్‌కి ఇప్పుడు సోషల్‌ మీడియా ఒకింత యూజ్‌ అవుతోంది. డైరెక్ట్‌గా సెలబ్రిటీలే తమ పర్సనల్‌ ఇష్యూస్‌ని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఈ సోషల్‌ నెట్‌ వర్క్‌ ద్వారా. అయితే, అంతకుమించి అనేలా సెలబ్రిటీల పర్సనల్‌ విషయాలు తెలసుకునే అవకాశమొస్తే.. ఎలా ఉంటుంది.

 

అంతకు మించి అంటే వారి బెడ్రూమ్స్‌ వరకూ అన్నమాట. అలాంటి అవకాశం మంచు వారమ్మాయి మంచు లక్ష్మి ద్వారా కలగబోతోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఈ తరహా షో రన్‌ అవుతోంది. 'ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌' అనే పేరుతో ఇలాంటి షో నడుస్తోంది. ఈ షో తెలుగు వెర్షన్‌ని త్వరలోనే తెలుగులోకి తీసుకురానున్నారు. ఈ ఇంట్రెస్టింగ్‌ ప్రోగ్రామ్‌కి మంచు లక్ష్మి ప్రసన్న హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. వయాకామ్‌ 18 సంస్థ ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ నెల 23 నుండి ప్రసారం కానున్న ఈ షో ద్వారా బుల్లితెరపై పెద్ద తారల బెడ్రూమ్‌ సీక్రెట్స్‌ రివీల్‌ కానున్నాయన్న మాట.

 

ఇంతవరకూ ఎవరికీ తెలియని, అఫ్‌కోర్స్‌ సెలబ్రిటీలు కూడా ఎవరితోనూ షేర్‌ చేసుకోని బెడ్రూమ్‌ సీక్రెట్‌లు ఈ షో ద్వారా మంచు లక్ష్మి వారి నోటి నుండే తెలియచెప్పే ప్రయత్నం చేస్తారన్న మాట. ఇంకేముంది ఫ్యాన్స్‌కి తమ అభిమాన హీరోల ప్రైవేట్‌ అండ్‌ పర్సనల్‌ ఇష్యూస్‌ ఈజీగా తెలుసుకోవచ్చన్నమాట. మామూలుగా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు అంటేనే వాటికి ఫ్యాన్స్‌లో బోలెడంత క్రేజ్‌ ఉంటుంది. అలాంటిది అంతకుమించి అనేలా వారి ప్రైవేట్‌ ఇష్యూస్‌ అంటే.. చెప్పడానికేముంది. చూడాలి మరి, ఈ ప్రోగ్రామ్‌కి ఎలాంటి క్రేజ్‌ దక్కుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS