మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా ఏ ముహూర్తంలో మొదలెట్టారో గానీ, అప్పటి నుంచీ... ఈ కాంబోకి కష్టాలు తప్ప లేదు. వరుసగా అన్నీ స్పీడు బ్రేకర్లే. ఇప్పుడు ఈ సినిమా మొదలవ్వకముందే పది కోట్లు నష్టపోయింది. వివరాల్లోకి వెళ్తే..
మహేష్ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది వేసవిలో ఈ సినిమా మొదలవ్వాలి. కానీ కథలో మార్పులు చేర్పుల వల్ల ఆలస్యమైంది. అప్పట్లో ఓ షెడ్యూల్ మొదలెట్టి, ఓ భారీ యాక్షన్ సీన్ తీశారు కూడా. దాని కోసం ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా కథ మారిపోయింది. పాత కథని పక్కన పెట్టి, కొత్త కథ రాసుకొన్నారు. ఆ కథలో.. ఇది వరకు తీసిన ఫైట్ సీక్వెన్స్ కి చోటు లేకుండా పోయింది. అంటే.. రూ.10 కోట్లతో తీసిన ఫైటు మొత్తాన్ని పక్కన పెట్టేయాల్సిందే. సో.. ఈ సినిమా మొదలవ్వకముందే పది కోట్ల నష్టం వచ్చినట్టు.
ఈ నెలలోనే షూటింగ్ మొదలవ్వాల్సివుంది. అయితే.. అది కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023లో ష్రెష్షుగా షూటింగ్ స్టార్ చేయాలని మహేష్ - త్రివిక్రమ్ భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్, తమన్ ఈ సిట్టింగ్స్ లో జోరుగా పాలు పంచుకొంటున్నారు.