హీరోలంతా `పాన్ ఇండియా` ఇమేజ్ వైపు దృష్టి పెట్టారు. అగ్ర కథానాయకుల సినిమాలు దాదాపుగా ఆ ఆలోచనతోనే పట్టాలెక్కుతున్నాయి. తాజాగా మంచు మనోజ్కూడా ఓ పాన్ ఇండియా సినిమా తీద్దామని డిసైడ్ అయిపోయాడు. `అహం బ్రహ్మస్మి` పేరుతో ఓ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోవిడుదల చేస్తాననిప్రకటించాడు. ఓ సినిమాని అన్ని భాషల్లోనూ తీసుకెళ్లాలన్న ప్రయత్నం మంచిదే.కాకపోతే మనోజ్పరిస్థితి చాలా ఘోరంగా ఉందిప్పుడు. తను వెండి తెరపై కనిపించి మూడేళ్లయ్యింది.
అంతకు ముందు చేసిన సినిమాలుకూడా ఫ్లాపే. కథలు వెదుక్కోవడానికీ, దాన్ని పట్టాలెక్కించడానికి ఇంత కాలం ఓపిక పట్టాల్సివచ్చింది. బడా హీరోల సినిమాలు సైతం మిగిలిన భాషల్లో పల్టీలు కొడుతున్న ఈ తరుణంలో పాన్ ఇండియా ప్రయత్నం అవసరమా? అనిపిస్తోంది. ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేసి హిట్టు కొట్టి, ఆ తరవాత పాన్ ఇండియా వైపు దృష్టి సారిస్తే మంచిదేమో..??