Manchu Manoj, Vaishnav Tej: మంచు క‌థ‌... మెగా కాంపౌండ్‌కు వెళ్లిపోయిందా?

మరిన్ని వార్తలు

మంచు మోహ‌న్ బాబు వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని ఆ ఇంటి నుంచి విష్ణు, మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ వ‌చ్చారు. ముగ్గురూ న‌టులుగా, నిర్మాత‌లుగా త‌మ‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఈమ‌ధ్య కాలంలో ఈ ముగ్గురికీ స‌రైన బ్రేక్ రాలేదు. విష్ణుకి వ‌రుస ఫ్లాపులు వ‌చ్చాయి. మంచు ల‌క్ష్మి మెల్ల‌గా సైడ్ అయిపోయింది. మంచు మ‌నోజ్ అయితే చాలా కాలంగా సినిమానే చేయ‌డం లేదు. విష్ణు ఇప్పుడు ఓ సినిమాని మెల్ల‌గా ప‌ట్టాలెక్కించాడు. మ‌నోజ్ నుంచి ఏ క‌బురూ లేదు. కొవిడ్ కి ముందు అహం బ్ర‌హ్మ‌స్మి అనే ఓ సినిమా మొద‌లెట్టాడు. పాన్ ఇండియా సినిమా ఇద‌ని, దీనికి భారీ బ‌డ్జెట్ కేటాయించామ‌ని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది. మ‌ళ్లీ ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కేదీ ఎవ‌రికీ స‌మాచారం లేకుండా పోయింది. ఇఇప్పుడు ఈ సినిమాని మ‌ళ్లీ మొద‌లెడ‌తార‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే.. ఓ ట్విస్టు ఏమిటంటే.. ఈ ప్రాజెక్టు నుంచి ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ రెడ్డి త‌ప్పుకొన్నాడు.

 

ఇదే ద‌ర్శ‌కుడు ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ తో ఓ సినిమా మొద‌లెట్టాడు. ఇటీవ‌ల చిన్న డైలాగ్ టీజ‌ర్ కూడా వ‌దిలారు. ఆ డైలాగ్ చూస్తుంటే.. అహం బ్ర‌హ్మ‌స్మీ క‌థ‌నే.. వైష్ణ‌వ్ తేజ్ తో తీస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి.. మంచు సినిమా ఏమైన‌ట్టు? అది ఆగిపోయిందా? ఆ క‌థే.. వైష్ణ‌వ్ తో తీస్తే, అహం బ్ర‌హ్మ‌స్మీ టైటిల్ తో మ‌నోజ్ తీయ‌బోతున్న సినిమా ఏమిటి? అస‌లు మ‌నోజ్ సినిమా ఉంటుందా, లేదా? ఇవ‌న్నీ పెద్ద ప్ర‌శ్న‌లుగా మారాయి. మ‌నోజ్ ప్ర‌స్తుతం బ‌రువు తగ్గే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నాడ‌ట‌. దాని కోసం ఇంకొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఆ త‌ర‌వాతే... సినిమాల‌పై ఓ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని టాలీవుడ్ టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS