తెలుగు హీరో మంచు మనోజ్ చాలారోజులకి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇదేదో తన చిత్రం గురించి కాదు, ఒక పబ్ లో జరిగిన వివాదం కారణంగా..
ఆ వివరాల్లోకి వెళితే, మంచు మనోజ్ గత నెలలో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పబ్ కి వెళ్ళటం జరిగింది. దాదాపు పబ్ మూసేసే సమయం అవ్వడంతో డిజే ని నిర్వాహకులు ఆపేయడంతో అక్కడే ఉన్న మనోజ్ వారితో వాగ్వాదానికి దిగడం అక్కడే ఉన్న స్పీకర్లని పగలగొట్టడం జరిగిందట.
విషయం తెలిసి అక్కడకి చేరుకున్న పోలీసులు వివరణ కోరగా తన తప్పేమీ లేదని చెప్పాడట. ఇక పూర్తి ఆధారాల కొరకు పబ్ CCTV ఫుటేజ్ ని పోలీసులు వారి వెంట తీసుకెళ్ళారు.
అయితే పబ్ నిర్వాహకులు మనోజ్ పైన ఫిర్యాదు చేయడానికి ముందుకి రాకపోవడంతో పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు.