మంచు మనోజ్‌ ఇప్పుడేం చేస్తున్నాడు.!

By iQlikMovies - October 29, 2018 - 18:25 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు మంచు మనోజ్‌ ఈ మధ్య తన కొత్త ప్రయాణం అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంటే మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఎవరికి తోచినట్లుగా వారు వార్తలు క్రియేట్‌ చేసుకున్నారు. 

అయితే తాజాగా మంచు మనోజ్‌ ఎక్కడున్నాడనే వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. కొంత కాలం పాటు తాను హైద్రాబాద్‌కి దూరంగా వుంటానని ఇప్పటికే అభిమానులకు చెప్పిన మనోజ్‌, తిరుపతికి వెళ్ళి అక్కడినుంచే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో వున్నాడు. సినిమాలా.? రాజకీయమా.? దేనికి ప్రయార్టీ? అనడిగితే, ఖచ్చితంగా తన ప్రయార్టీ సినిమాలకేనని మనోజ్‌ తేల్చి చెప్పాడు.  సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో మనోజ్‌, కొన్ని నెలలపాటు 'విరామం' తీసుకుంటున్నాడు సినిమాల నుంచి. అంతే తప్ప, పూర్తిగా సినిమాలకు దూరమయ్యే ఆలోచన మనోజ్‌కి లేదని ఇంకోసారి స్పష్టమయ్యింది. 

ఇదిలా వుంటే, తారక్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు మంచు మనోజ్‌. ఎన్టీఆర్‌ అంటే మంచు ఎన్టీఆర్‌పై మనోజ్‌ లవ్వే వేరబ్బా. అభిమానులు ఎన్టీఆర్‌ గురించి చెప్పమని అడిగినప్పుడు, 'నా ప్రాణం' అని మనోజ్‌ సమాధానమిచ్చాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తోనూ, యంగ్‌ టైగర్‌ తనయుడు అభయ్‌రామ్‌తోనూ మంచు మనోజ్‌కి మంచి 'లవ్‌' వుంది మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS