ఓ రకంగా చెప్పాలంటే మంచు మనోజ్ అందరి వాడు. ఎన్టీఆర్‌కి క్లోజ్ ఫ్రెండ్. చరణ్‌ని సోదరుడిలా చూస్తుంటాడు. అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న మనోజ్.. మరోసారి తన ట్వీట్‌తో ఆకట్టుకున్నాడు.
ఈమధ్య రామ్ చరణ్ `ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటా` అని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ సలహా మేరకు.. చరణ్ తిత్లీ తుఫాను బాధిత గ్రామాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాడు. దీనిపై మనోజ్ స్పందించాడు. ``గ్రేట్ జాబ్. సోదరా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. పవన్ కల్యాణ్‌కి కూడా కృతజ్ఞతలు.. ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేలా చరణ్‌లో స్ఫూర్తి నింపినందుకు`` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని మెగా ఫ్యాన్స్ వైరల్ చేయడం మొదలెట్టారు.
అయితే కొంతమంది మాత్రం ఇది కూడా మనోజ్ పొలిటికల్ ప్లాన్‌లో భాగమే అంటూ కొత్త అర్థాలు తీస్తున్నారు. ఇటీవల `ప్రజాసేవ చేయాలనివుంది` అని మనోజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అది చూసి.. మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం మొదలైపోయింది. మనోజ్ తాజా ట్వీట్ చూసి - తను జనసేనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడని, అందుకే ఇలా ట్వీట్ చేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. మరి మనోజ్ మనసులో ఏముందో..?
అన్నట్టు మనోజ్ తిరుపతి చేరుకున్నాడు. అక్కడి అభిమానులు మనోజ్‌కి ఘన స్వాగతం పలికారు. మనోజ్ మాత్రం `నా కామెంట్లకు రాజకీయ రంగు పులమొద్దు. నేను ప్రజా సేవ చేయడానికి వచ్చా` అంటూ అభిమానుల్ని వేడుకుంటున్నాడు.