మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. 2005లో ప్రణతి రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. ఇటీవల ఇద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. తామిద్దరి మధ్య చాలా సందర్భాలలో మనస్పర్థలు వచ్చాయని, అందుకే విడిపోవాల్సివచ్చిందని, అయితే ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని, కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని ఆయన వివరించారు.
ఈ గొడవల వల్లే తాను సినిమాలపైల దృష్టి నిలుపలేకపోయానని, ఈ విషయంలో కుటుంబం, అభిమానులు అందించిన ప్రోత్సాహాన్ని మర్చిపోలేనని అన్నారు మనోజ్. తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మనోజ్.. త్వరలోనే సినిమాల్లో నటిస్తున్నానని పేర్కొన్నారు.
wanted to share this with u guys since long... Finalllly Here i go 🙏🏻 #Destiny I guess ... pic.twitter.com/G5UxygNTfB
— MM*🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2019