కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన మంచు మనోజ్‌.!

By Inkmantra - February 13, 2020 - 10:10 AM IST

మరిన్ని వార్తలు

సెలెక్టివ్‌గా సినిమాలు చేసే మంచు మనోజ్‌ ఈ మధ్య సినిమా నుండి జస్ట్‌ స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్నాడు. చిన్న బ్రేక్‌ తర్వాత చిటికెలో రాలేదు కానీ, సరికొత్త సినిమాతో రాబోతున్నాడు. ఆయన కమ్‌బ్యాక్‌ మూవీకి ‘అహం బ్రహ్మస్మి’ అనే అద్భుతమైన టైటిల్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాడు. ఇంత పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టాడంటే ఏదో గొప్ప కాన్సెప్ట్‌నే పట్టి ఉంటాడు మంచు మనోజ్‌. బేసిగ్గా మంచు మనోజ్‌కి యాక్టింగ్‌తో పాటు, కొన్ని టెక్నికల్‌ అంశాలపైనా మంచి పట్టుంది. తన సినిమాల్లో యాక్షన్‌ సీన్స్‌ తానే కంపోజ్‌ చేసుకుంటుంటాడు. అలాగే డాన్స్‌ స్టెప్పుల్లోనూ సరికొత్త ట్రెండ్స్‌ క్రియేట్‌ చేస్తుంటాడు.

 

మల్టీ టాలెంటెడ్‌ అయిన మంచు మనోజ్‌ లేటెస్ట్‌గా తన కొత్త సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తూ ఆ సరదా ముచ్చట ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నాడు. ఈ సినిమాని తన స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నాడు మనోజ్‌. ఎమ్‌.ఎమ్‌.ఆర్ట్స్‌ బ్యానర్‌ అనే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి, ఆ బ్యానర్‌లో తానే మొదటి సినిమా చేస్తున్నాడు మనోజ్‌. మార్చి 6న ఈ సినిమాని గ్రాండ్‌గా లాంఛ్‌ చేయనున్నారు. శ్రీకాంత్‌ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పుడప్పుడూ సినిమాలు చేసినా, మంచు మనోజ్‌ సినిమాల్లో సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అందుకే మంచు మనోజ్‌కి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. మరి ఈ ‘అహం బ్రహ్మస్మి’తో మంచు మనోజ్‌ ఏం మ్యాజిక్‌ చేయనున్నాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS