యూట‌ర్న్ తీసుకున్న స‌మంత‌

By Inkmantra - February 13, 2020 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

ఇక మూడేళ్ల‌లో సినిమాల నుంచి విర‌మిస్తా... అంటూ `జానూ` ప్ర‌మోష‌న్ల‌లో సంచ‌ల‌న స్టేట్‌మెంట్ ఇచ్చింది స‌మంత‌. కెరీర్ మంచి దూకుడుమీద ఉన్న‌ప్పుడే స‌మంత ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుంది? సినిమాల‌పై అప్పుడే ప్రేమ ఎందుకు త‌గ్గిందంటూ ఆమె అభిమానులు, ముఖ్యంగా చిత్ర‌సీమ ఆశ్చ‌ర్యపోయింది. స‌మంత కోసం క‌థ‌లు రెడీ చేసుకుంటున్న ద‌ర్శ‌కులు ఈ నిర్ణ‌యంతో డీలా ప‌డిపోయారు. అయితే ఇంత‌లోనే సమంత యూ ట‌ర్న్ తీసుకుంది. `నేను రిటైర్ అవుతాన‌ని అన‌లేదు` అంటూ మాట మార్చేసింది స‌మంత‌.

 

త‌న‌కు సినిమాల నుంచి దూర‌మ‌వ్వాల‌ని అస్స‌లు లేద‌ని, కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే - న‌టిస్తూ ఉంటాన‌ని, అయితే పాత్ర‌ల్ని ఎంపిక చేసుకునే విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల‌నుకుంటున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది స‌మంత‌. త‌ను న‌టించిన `జానూ `ఇటీవ‌లే విడుద‌లైంది. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమాకి స‌రైన క‌ల‌క్ష‌న్లు లేవు. దాంతో.. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయే పరిస్థితి ఎదురైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS