Manchu Manoj: రెండో పెళ్లి గురించి హింట్ ఇచ్చిన మంచు హీరో

మరిన్ని వార్తలు

మంచు మ‌నోజ్ వైవాహిక జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ణ‌తిని పెళ్లి చేసుకొన్న మ‌నోజ్ 2019లో విడాకులు ఇచ్చేశాడు. మూడేళ్లుగా ఒంట‌రిగానే ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా మ‌నోజ్ రెండో పెళ్లి గురించిన వార్త‌లు బ‌య‌ట షికారు చేస్తున్నాయి. భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికా రెడ్డితో మ‌నోజ్ స‌న్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌ని టాక్‌. దానికి సంబంధించి మ‌నోజ్ నుంచి హింట్ కూడా వ‌చ్చేసింది.

 

ఆదివారం మ‌నోజ్ సీతాఫ‌ల‌మండిలోని గ‌ణేశుడ్ని ద‌ర్శించుకొన్నాడు. ఈసారి తాను ఒక్క‌డే రాలేదు. మౌనికా రెడ్డిని కూడా తీసుకొచ్చాడు. కాబోయే దంప‌తులు ఇలా గుళ్ల చుట్టూ, గోపురాల చుట్టూ తిర‌గ‌డం కామ‌న్‌. కాబ‌ట్టి.. వీరిద్ద‌ర్నీ ఆ జాబితాలో చేర్చేశారు ఫ్యాన్స్‌. మ‌నోజ్‌, మౌనిక‌లు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని, అందుకే... ఇలా జంట‌గా క‌నిపించార‌ని వార్త‌లు మ‌రోసారి గుప్పుమ‌న్నాయి.

 

మంచు కుటుంబానికీ, భూమా నాగిరెడ్డి కుటుంబానికీ ముందు నుంచీ స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో మ‌నోజ్, మౌనిక‌లు స్నేహితులుగా మారారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారు. మ‌రో విశేషం ఏమిటంటే ఇద్ద‌రికీ ఇది రెండే పెళ్లే. మౌనికకి ఇది వ‌ర‌కే పెళ్ల‌య్యింది. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి ఒంట‌రిగా గ‌డుపుతోంది. రాజ‌కీయంగానూ మౌనిక బిజీగా ఉంటోంది. మ‌రోవైపు మ‌నోజ్ 'అహం బ్ర‌హ్మస్మి' పేరుతో ఓ పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. వీళ్ల పెళ్లిపై వ‌స్తున్న‌వ‌న్నీ ఊహాగానాలే. అయితే అధికారికంగా ఈ జంట నుంచి ఎప్పుడు క‌బురు వ‌స్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS