హీరో మంచు మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో నిర్మాతగా మారుతున్న విషయం విదితమే. సినిమా సంగతుల్ని పక్కన పెడితే, మంచు మనోజ్‌కి సామాజిక బాధ్యత ఎక్కువ. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో, తనవంతు బాధ్యతగా మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీని చేపట్టాడు మంచు మనోజ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘నేను చేస్తున్నాను, మీరు కూడా మీకు చేతనైనంత సాయం చేయండి.. కరోనా పట్ల అవగాహన పెంచండి..’ అంటూ సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ అభ్యర్థించాడు.
అయితే, నెటిజన్స్ మాత్రం మంచు మనోజ్‌ని బీభత్సంగా ట్రోల్ చేసేస్తున్నారు. కారణం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. అవును, వైఎస్ జగన్ ఇటీవల కరోనా గురించి మాట్లాడుతూ, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందనీ, బ్లీచింగ్ వేస్తే కరోనా వైరస్ చచ్చిపోతుందనీ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం విదితమే. ‘మీ బావ అలా చెప్పారు కదా.. మీరెందుకు మాస్క్‌లు, శానిటైజర్లు అంటున్నారు.. పారాసిటమాల్ ట్యాబ్లెట్లు పంచండి.. బ్లీచింగ్ పౌడర్ పంచండి..’ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు భార్య అయిన విరానికా, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి బంధువు అన్న విషయం విదితమే. బంధుత్వం మాత్రమే కాదు, ఇటీవలి ఎన్నికల సమయంలో మంచు విష్ణు, మోహన్‌బాబు స్వయంగా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అయితే, మంచు మనోజ్ మాత్రం రాజకీయాలకు దూరంగా వుంటున్నాడు. ఓ మంచి విషయాన్ని చెబుతున్నప్పుడు ఈ ట్రోలింగ్‌లో అర్థం లేదని నెటిజన్లు తెలుసుకుంటే మంచిది.
I'm doing my part by supplying masks and Sanitisers to the areas who can’t afford and for whom there is no proper awareness. I request everyone to stay safe and take necessary precautions! #coronavirus #CoronavirusOutbreak pic.twitter.com/rCaH2OR3tV
— MM*🙏🏻❤️ (@HeroManoj1) March 16, 2020