కరోనాపై పోరులో కొమరం భీమ్, సీతారామరాజు.!

మరిన్ని వార్తలు

ఎక్కడ.? ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ నుంచి అప్‌డేట్‌ ఎక్కడ.? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, మెగా పవర్‌ స్టార్‌ అభిమానులు. కానీ, వారు ఆశిస్తోన్న అప్‌డేట్‌ మాత్రం కన్పించడంలేదు. మరోపక్క, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్, కొమరం భీమ్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్‌లతో ప్రత్యేకంగా ఓ వీడియో షూట్‌ చేసి, దాన్ని సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఇది ‘కరోనా వైరస్‌’కి సంబంధించినది. ఇందులో ‘కరోనా వైరస్‌’ సోకకుండా ఏం చేయాలన్నదానిపై కొన్ని సూచనలు చేశారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రావ్‌ుచరణ్‌.

ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కో విషయాన్ని చెబుతోంటే, కాస్సేపు అభిమానులు అక్కడ జరుగుతున్న విషయాన్ని మర్చిపోయి, వారిద్దరినే అబ్జర్వ్‌ చేయడం మొదలు పెట్టారు. ఒకసారి కాదు, అలా పదిసార్లు ఈ వీడియోని చూస్తేగాని వారికి తనివి తీరడంలేదు మరి. ఇక, ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌ వచ్చి పడుతున్నాయి. సోషల్‌ రెస్పాన్సిబిలిటీ విషయంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌.. ఒకరితో ఒకరు బీభత్సంగానే పోటీ పడతారు. ఈ విషయం అందరికీ తెల్సిందే. ఏదిఏమైనా, సెలబ్రిటీల నుంచి ఇలాంటి విషయాలు ప్రచారంలోకి వస్తే, వాటి పట్ల అవగాహన మరింత పెరుగుతుంది. ఈ విషయంలో ఈ ఇద్దరికీ హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. మరీ ముఖ్యంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ని ఈ సందర్భంగా అభినందించకుండా వుండలేం. మూవీ అప్‌డేట్‌ తరహాలో.. ఇప్పుడు ఈ వీడియోకి పాపులారిటీ వచ్చిపడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS