ఈ నెల 26న సూర్య హీరోగా తెరకెక్కిన 'సింగం 3' సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సిన ఈ సినిమాకు తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమం నేపధ్యంలో టైమ్ కలిసి రాక విడుదల తేదీని వాయిదా వేసుకోవడం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన మంచు విష్ణు సినిమా 'లక్కున్నోడు' ఈ ప్లేస్‌లోకి వచ్చి చేరింది. ఈ డేట్‌లో మరే ఇతర తెలుగు సినిమాలు లేవు. అలాగే సినిమా రిలీజ్‌కి, అనౌన్స్‌మెంట్ డేట్‌కి చాలా తక్కువ టైం తీసుకున్నారు. ఆ టైంలోనే ఈ సినిమాకి పబ్లిసిటీ బాగా చేశారు. రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇంతవరకూ విష్ణు సినిమాల్లో ఏ సినిమాకీ రానంతగా ఈ సినిమాకి ఓపినింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. హారర్ కామెడీతో 'గీతాంజలి' సినిమాని అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అయిన డైరెక్టర్ ఈ సినిమాతో ఓ కొత్త రకం కామెడీని పరిచయం చేయబోతున్నాడట. అంతేకాదు నోట్ల రద్దు వ్యవహారం జోరుగా ఉన్న ఈ టైంలో ఈ సినిమాని విడుదల చేయడం యాప్ట్ అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి నోట్ల రద్దు ఇష్యూతో సంబంధం ఉందట. అదేంటో సినిమాలోనే చూడాలంటున్నాడు మంచు విష్ణు. 'లక్కున్నోడు' సినిమాలో విష్ణు సరసన హన్సిక హీరోయిన్‌గా నటించింది.