'మా' కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బాధ్యతల్ని కూడా చేపట్టారు. కానీ... ప్రమాణ స్వీకారం మాత్రం ఇంకా జరగలేదు. అందుకు ముహూర్తం కుదిరింది. ఈనెల 16 తేదీన ఉదయం 11.45 నిమిషాలకు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ... వేదిక ఇంకా ఖరారు కాలేదు. వేదిక ఖరారు అయిన వెంటనే.. సోషల్ మీడియా ద్వారా చెబుతానని విష్ణు తెలిపారు.
గురువారం మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ నందమూరి బాలకృష్ణను కలుసుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని బాలయ్య ఇంటికి.. వెళ్లి, ఆయన ఆశీస్సులు అందుకున్నాడు విష్ణు. ఇప్పటికే కోటా, కైకాల, పరుచూరి బ్రదర్స్‌ను కలిశానన్నారు. ప్రమాణస్వీకారానికి ప్రకాష్‌రాజ్ సహా అందరినీ ఆహ్వానిస్తానన్నారు. రాజీనామాలపై ఈసీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా మోహన్ బాబు సైతం మీడియాతో మాట్లాడారు. ``బాలయ్య ఆశీస్సులు విష్ణుకి ఉన్నాయి. తన సొంత డబ్బులతో మా భవనం నిర్మిస్తానని విష్ణు చెప్పగానే, బాలయ్యసంతోషించారు. తాను కూడా సాయం చేస్తా అన్నారు`` అని గుర్తు చేశారు మోహన్ బాబు.