ప్రభాస్ రాధే శ్యామ్ దాదాపు పూర్తయింది. సలార్, ఆదిపురుష్ సెట్స్ పై వున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి వంగ దరశకత్వంలో సినిమా ప్రకటన వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తారు. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు లో మళ్ళీ సినిమా చేయలేదు సందీప్. మహేష్ బాబు కి ఓ కథ చెప్పాడు. కానీ కుదర్లేదు. ఇప్పుడు అదే కథ ప్రభాస్ తో సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంభంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే .. ఇందులో ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తారని టాక్. సందీప్ , మహేష్ బాబు తో కథ చెప్పినపుడు డ్రగ్స్ మాఫియా నేపధ్యంలో సాగే లైన్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చింది ఈ సినిమా టైటిల్.
సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ పెట్టారు. స్పిరిట్ అంటే ఆత్మ , మనస్సు , మానసిక స్థితిని తెలియజేసే సందర్భాల్లో ఈ పదంని వాడుతారు. ఐతే స్పిరిట్ కి మెడికల్ అర్ధం తీసుకుంటే గాయాలని శుభ్రపరిచే ద్రావణం, ఆపరేషన్లు చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా వాడే ద్రావణంను కూడా స్పిరిట్ అనే పిలుస్తారు. సందీప్ రెడ్డి వంగ రాసుకున్న టైటిల్ కి మీనింగ్ మెడికల్ స్పిరిటె. అర్జున్ రెడ్డిలో కూడా మెడికల్ , డ్రగ్స్ టచ్ ఇచ్చాడు సందీప్ . స్పిరిట్ కథని పూర్తిగా డ్రగ్స్ కోణంలో రాసుకున్నాడు. ఇందులో ప్రభాస్ డ్రగ్స్ రాకెట్ ఛేదించి, మత్తుని క్లీన్ చేసే పోలీసు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఐతే ప్రభాస్ పోలీస్ అనే సంగతి ట్విస్ట్ లా కాకుండా సినిమా మొదట్లోనే ఆడియన్స్ కి చెప్పేలా కథనం వుంటుందట. మొత్తానికి మొదటి సారి ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపిస్తున్నాడు 'స్పిరిట్' కోసం.