మంచు విష్ణుని 'ఓటర్‌' ఆదుకుంటాడా.?

మరిన్ని వార్తలు

ఈ మధ్య లిస్టులోనే లేకుండా పోయారు మంచు హీరోలు. ఈ తరుణంలో మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం ఒకటి లేటెస్ట్‌గా వెలుగులోకి వచ్చింది. అప్పుడెప్నట్నుంచో నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకి 'ఓటర్‌' అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఎన్నికల హీట్‌ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో 'ఓటర్‌' టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. 

 

నిడివి చాలా తక్కువే ఉంది కానీ, వీలైనంతలో కమర్షియల్‌ అంశాలన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఒకట్రెండు యాక్షన్‌ సీన్లు, పొలిటికల్‌ పంచ్‌ డైలాగులూ పడ్డాయి. సామాజిక స్పృహ కలిగిన ఓ సామాన్య యువకుడు దేశంలోని పేదరికం పట్ల కలత చెందుతూ ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే పాలకుల్లో మార్పు తీసుకురావడం ఒక్కటే మార్గమని వ్యవస్థకు ఎదురు తిరిగే సాహసం చేస్తాడు. 

 

మరి ఈ యువకుడి సాహసం ఫలిస్తుందా.? సినిమాలో హీరోగా మంచు విష్ణు చెప్పిన డైలాగ్‌లో మాదిరి ఓటర్‌ ఓనర్‌ అవుతాడా.?అనేది తెలియాలంటే 'ఓటర్‌' సినిమా చూడాల్సిందే. ఎలక్షన్‌ సెగ కరెక్ట్‌గా ఈ రేంజ్‌లో ఉన్నప్పుడే ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఒక రకంగా ఈ సినిమా ఓటర్‌ని ఆలోచింపచేసేందుకు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఉపయోగపడుతుందనిపిస్తోంది. అదే జరిగితే మంచు విష్ణుకి విజయం వరించినట్లే. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS