సౌత్‌పై ఫోకస్‌ పెట్టిన బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో ఓ బయోపిక్‌ రూపొందుతోంది. హైద్రాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ సయ్యద్‌ అబ్ధుల్‌ రహీమ్‌ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్‌ చేయనున్నారట. బాలీవుడ్‌ హీరోలైన అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ తదితరులకు తెలుగులో కూడా మంచి పేరుంది. 

 

అప్పుడప్పుడూ ఈ హీరోలు నటించిన సినిమాలు తెలుగులోకి డబ్‌ అవుతుంటాయి. కానీ ఇంతవరకూ అజయ్‌దేవగన్‌ నటించిన సినిమాలకు తెలుగులో అస్సలు సీను లేదు. కానీ ఇకపై సౌత్‌ సినిమాల పైనా అజయ్‌దేవగణ్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ తాజా సినిమాతో అజయ్‌దేవగణ్‌ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నాడన్న మాట. ఈ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో కీర్తిసురేష్‌కి మంచి పాపులారిటీ ఉందిప్పుడు. 

 

'ఆర్కిటెక్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌' అని అభిమానులు ముద్దుగా పిలచుకునే సయ్యద్‌ అబ్దుల్ రహీమ్ భార్య పాత్రలో కీర్తిసురేష్‌ నటిస్తోంది. ఈ పాత్ర సినిమాకు అత్యంత కీలకం. అందుకే ఏరికోరి ఆమెను ఈ పాత్ర కోసం ఎంచుకున్నారు. ఏది ఏమైనా బాలీవుడ్‌ ఎంట్రీ మూవీకే పర్‌ఫామెన్స్‌ బేస్‌డ్‌ క్యారెక్టర్‌ కీర్తిని వరించడం ఓ విశేషం అయితే, హైద్రాబాద్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ అయిన సయ్యద్‌ అబ్దుల్ రహీమ్ బయోపిక్‌తో అజయ్‌దేవగణ్‌ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS