ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'పై రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ప్రచారంలో ఉన్నట్లుగానే 'ఆర్‌ఆర్‌ఆర్' పీరియాడికల్ మూవీ అని ఆయన తేల్చేశారు. ఇద్దరు యువ స్వాతంత్య్ర సమరయోధుల కథగా 'ఆర్‌ఆర్‌ఆర్'ని రాజమౌళి తెరకెక్కించనున్నారు. వారే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు. అయితే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల గురించి మనకు తెలిసిన కథలు కాకుండా, తెలియనీ ఎవ్వరూ చూడని కథని 'ఆర్‌ఆర్‌ఆర్' ద్వారా జక్కన్న చూపించబోతున్నారట.
స్వాతంత్య్ర సమరయోధులు అంటే చివరికి వీర మరణం పొందడమే. కానీ ఈ సినిమాలో వీర మరణం లేదు. వీరులుగా వారు ఎలా ఎదిగారు అన్న దగ్గర కథ ఎండ్ అవుతుందట. సో 'ఆర్‌ఆర్‌ఆర్' హ్యాపీ ఎండింగ్ అన్నమాట. ఇకపోతే కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఎట్టకేలకు 'ఆర్‌ఆర్‌ఆర్' మీద నెలకొన్న అనుమానాలన్నింటినీ రాజమౌళి ఒక్కసారిగా పటాపంచలు చేసేశారు.
దటీజ్ రాజమౌళి. ఏదైనా సరే ముందుగానే చెప్పి చేస్తారు రాజమౌళి. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాబట్టి, ఈ సినిమా కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశారట. దాంతో ఈ సినిమాపై నెలకొన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేందుకు ఇంత టైం పట్టింది జక్కన్నకు. మొత్తానికి 'ఆర్‌ఆర్‌ఆర్'పై నెలకొన్న గాసిప్స్ అన్నింటికీ ఓవరాల్‌గా చెక్ పడిపోయినట్లే.