'చదరంగం'కు రంగం సిద్ధం చేసిన మంచు విష్ణు!

By Inkmantra - January 14, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

నితిన్‌ - చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా ఈ సినిమాకి 'చదరంగం' అనే టైటిల్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారనే టాక్‌ ఉంది. ఈ లోగా ఈ టైటిల్‌ని మరో హీరో ప్రకటించాడు. ఆయన మరెవరో కాదు, మంచు హీరో విష్ణు. అయితే, ఇది సినిమా కాదండోయ్‌. వెబ్‌ సిరీస్‌. హీరోగానే కాకుండా, నిర్మాతగా పలు వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందిస్తున్నాడు మంచు విష్ణు. ఆ క్రమంలోనే, పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించాడు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కి టైటిల్‌ ఫిక్స్‌ చేశాడు.

 

రాజకీయాల్లో జరిగే ఎత్తుకు, పై ఎత్తుల నేపథ్యంలో సాగే కథ కాబట్టి, ఈ వెబ్‌ సిరీస్‌కి 'చదరంగం' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసి, లేటెస్ట్‌గా టైటిల్‌ని ప్రకటించారు. శ్రీకాంత్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, సునయన మరో కీలక పాత్రలో నటిస్తోంది. 9 భాగాలుగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో ప్రసారం కానుంది. రాజ్‌ ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 20 నుండి ఈ వెబ్‌ సిరీస్‌ అందుబాటులోనికి రానుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS