60 కోట్ల బడ్జెట్‌తో ‘మంచు’వారి ‘భక్త కన్నప్ప’.

మరిన్ని వార్తలు

మంచు కుటుంబం నుంచి త్వరలో ‘భక్త కన్నప్ప’ సినిమా రాబోతోంది. చాలాకాలం క్రితం వచ్చిన ‘భక్త కన్నప్ప’ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ ఫిలిం. దాన్ని రీమేక్‌ చేయాలనే ఆలోచనలు ఎప్పటినుంచో జరుగుతున్నా అవి ఓ కొలిక్కి రావడంలేదు. తాజాగా ‘భక్త కన్నప్ప’ సినిమాని నిర్మించనున్నట్లు కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌బాబు ప్రకటించారు. ఈ సినిమాని మంచు విష్ణు నిర్మిస్తారట. 60 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని మోహన్‌బాబు వ్యాఖ్యానించడం గమనార్హం. మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో కన్పించనున్న విషయం విదితమే.

 

నిన్న మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని (టైటిల్‌తో సహా) విడుదల చేశారు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో ‘అను’ అనే పాత్రలో నటిస్తోంది. ఐటీ స్కావ్‌ు నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగుతోపాటు ఇంగ్లీషులోనూ ఈ సినిమా నిర్మితమవుతోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఓ పక్క బిజీగా వుంటూనే, ఇంకోపక్క సినిమాలపై మళ్ళీ ఫోకస్‌ పెట్టాడు మంచు విష్ణు. నటన కంటే కూడా ఎక్కువగా నిర్మాణంపై మంచు విష్ణు దృష్టి పెడుతున్నాడట. అయితే, తాను నిర్మించే సినిమాల్లో మంచు విష్ణు నటించకుండా వుంటాడా.? ఇక ‘భక్త కన్నప్ప’ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయట. 60 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మంచు కుటుంబం దీన్నొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపొందించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS