వైష్ణవ్‌ కోసం చరణ్‌, తరుణ్‌ కోసం వరుణ్‌.!

By Inkmantra - February 22, 2020 - 16:02 PM IST

మరిన్ని వార్తలు

ఈ జనరేషన్‌ హీరోలు తమ తమ సినిమాలకు ఏదో ఒకరకంగా సపోర్ట్‌ అందించుకుంటూ స్నేహ భావంతో ముందుకు సాగుతున్నారు. ఈ స్నేహం ఇండస్ట్రీని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుందనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. తాజాగా మెగా కాంపౌండ్‌ నుండి డెబ్యూ చేస్తున్న హీరో వైష్ణవ్‌ తేజ్‌కి చరణ్‌ సపోర్ట్‌గా నిలిచాడు. వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ‘ఉప్పెన’కి సంబంధించి లేటెస్ట్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ, ‘వెల్‌కమ్ వైష్ణవ్‌ తేజ్‌.. ఈ కొత్త ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించు..’ అంటూ గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పాడు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న రిలీజ్‌ అవుతోంది.

అలాగే మరో యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ మార్చి 25న ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో జరుగుతోన్న ప్రమోషన్స్‌లో భాగంగా ‘కురిసె.. కురిసె..’ అనే లిరికల్‌ సాంగ్‌ని మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ తన ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశాడు. రాజ్‌తరుణ్‌కి ఈ సినిమా మంచి హిట్‌ అందించాలని కోరుకున్నాడు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని కె.కె.రాధా మోహన్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, హాట్‌ బ్యూటీ హెబ్బా పటేల్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. రాజ్‌తరుణ్‌ తన మార్క్‌ ఎనర్జీతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమాతో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS