బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాట్లాడితే ఓ సంచలనమే. అఫ్‌కోర్స్ సంచనం అయ్యేలానే ఆమె మాటలూ, చేష్టలూ ఉంటాయనుకోండి. ఇక తాజాగా మరోసారి కంగనా రనౌత్ మాటలు సంచలనమయ్యాయి. ఇటీవల ఆమె ఓ ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘సంజు’ చిత్రం మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్‌గా కంగనాని అడిగారట. నో అని చెప్పిందట. అలాగే ‘సుల్తాన్’ సినిమాలోనూ సల్మాన్ పక్కన జోడీగా కంగనానే అడిగారట. అప్పుడూ తనకు కుదరదని ఖరాఖండిగా చెప్పేసిందట. దాంతో ఆ ప్లేస్‌ని అనుష్కా శర్మ దక్కించుకుంది.
ఇలా ఈ రెండు హిట్ మూవీస్‌లోనూ ఛాన్స్ వదులుకున్నాననీ, అయినా కావాలనే నేను ఆయా సినిమాల్లో నటించనని చెప్పాననీ కంగనా చెప్పడం విశేషం. హిట్ మూవీస్‌లో ఛాన్స్ మిస్ అయితే, అరెరే ఆ ఛాన్స్ అనవసరంగా మిస్ చేసుకున్నానే అని ఫీలవుతుంటారు హీరోయిన్లు. కానీ, ఇక్కడ ఉన్నది కంగనా.. నో వే.. అలాంటి ఛాన్స్ తీసుకోదు. ఇవ్వదు. అందుకే ఆమె ఫైర్ బ్రాండ్ అయ్యింది. అయినా అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడెందుకు గొప్పగా చెప్పుకోవడం, పబ్లిసిటీ స్టంట్ కోసమేగా.. అంటూ కంగనా యాంటీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.